•  జీడబ్ల్యు ఎం సి ఆధ్వర్యం లో వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన కార్యక్రమం
  •  కుక్కల దత్తత కోసం రిజిస్ట్రేషన్ల చేసుకోవాలన్న కమిషనర్

వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి :

జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అభిప్రాయ పడ్డారు. ప్రజా చైతన్యం కోసం జీడబ్ల్యుఎంసి ఆధ్వర్యం లో మంగళవారం వెంకటేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన “వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన aకార్యక్రమం “లో కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, రాధికా గుప్తా లతో కలిసి నగర మేయర్ ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరం లో జరుగుతున్న కుక్కల దాడులను నియంత్రించడానికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ప్రజలకు అవగాహన కల్పిస్తూ జంతు ప్రేమికులుగా కుక్కల దాడులను నియంత్రించడానికి దృశ్య రూప ప్రదర్శన (ప్రజెంటేషన్) ఇవ్వడం జరిగిందని అన్నారు.

బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్ లలో నీటి తొట్టె లను ఏర్పాటు చేయడం కార్పొరేటర్లు, అధికారులు, ఆర్పీలు విద్యా శాఖకు చెందిన అధికారుల లతో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తో పాటు కార్పొరేషన్ తరఫునుండి ప్రత్యేక అప్లికేషన్ (ఆప్) ను తయారు చేయడం జరిగిందన్నారు.

ఆప్ ద్వారా రూ.100 చెల్లించి రిజిస్ట్రేషన్ సౌకర్యం పొందడం, నగరం లో గల ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటికి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి కుక్కలను సంరక్షించడం కోసం ప్రత్యేకం గా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఏ కార్యక్రమం ఐనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతాయని తెలిపారు.

అందుకే ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని,అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి జంతువుల పట్ల ప్రేమ భావం పెంపొందించి వారు ఉండే ఆవాసాల్లో కుక్కలకు ఆహారం అందించడం, నీటి తొట్టెల ఏర్పాటు చేసేలా చూస్తామని,తద్వారా కుక్కల దాడుల నుండి ప్రజలను రక్షించవచ్చని, డివిజన్ ల వారిగా కుక్కలకు వాక్సినేషన్ ప్రోగ్రాం లను ఏర్పాటు చేయడం తో పాటు కుక్కల లో చర్మ వ్యాధులను అరికట్టడానికి డి వార్మింగ్ చేయడం వంటి కార్యక్రమాలను ప్రణాళిక బద్ధం గా ఒక ఆక్షన్ ప్లాన్ తయారు చేసి కార్పొరేటర్ల భాగస్వామ్యం తో ఇట్టి ప్రోగ్రామ్స్ లో ప్రజలను పాల్గొనేలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళతామని ఈ సందర్భం గా మేయర్ తెలిపారు.

జంతు ప్రేమికులు, పెట్ బ్రీడర్లు బల్దియా సమన్వయం తో కార్పొరేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని, డాగ్ లైసెన్సింగ్, పెట్ రిజిస్ట్రేషన్,పెట్ అడాప్షన్,డాగ్ అవేర్నెస్ ల గురించి విద్య శాఖ సమన్వయం తో.పాఠశాలలు,కళాశాలల్లో అవగాహన కలిగిస్తామని, మన సామాజిక బాధ్యత అందరూ తీసుకోవాలన్న ఉద్దేశ్యం తో అందరినీ భాగస్వాములు చేయడం జరుగుతుందన్నారు.

ప్రతి డివిజన్ లో ప్రణాళికాబద్ధంగా ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని మేయర్ అన్నారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగరం లో వీధి కుక్కల వల్ల జరుగుతున్న దాడులను దృష్టి లో ఉంచుకొని ప్రజలను చైతన్య వంతం చేయడానికి కార్పొరేటర్లు, మెప్మా సిబ్బంది ఆర్పీలు,శానిటరీ సిబ్బంది,జంతు ప్రేమికులు అందరినీ కలుపుకొని అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కార్పొరేషన్ తరఫున ప్రతి సంవత్సరం స్టేరిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని,వేసవి కాలాన్ని దృష్టి లో ఉంచుకొని, కుక్కలకు ఏవిధంగా ఆహారం,నీటి ని అందించాలని మెప్మా విభాగానికి చెందిన ఆర్ పి లు,టి ఎల్ ఎఫ్ ల సహకారం తీసుకోవడం, వారికి అవగాహన కలిగించడం, క్షేత్రస్థాయిలో కుక్కల పైన అవగాహన ఉన్న శానిటేషన్ సిబ్బందిని ఇందులో భాగస్వామ్య చేయడం వినూత్నంగా పెట్ లైసెన్స్ ను తొలి సారి ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.

పెట్ డాగ్స్ కు రూ .100 చెల్లించి లైసెన్స్ పొందాలని,అనివార్య కారణాల వల్ల కుక్క లపై ఫిర్యాదు అందితే లైసెన్స్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, లైసెన్స్ లేని కుక్క లను తీసుకువెళ్లడం జరుగుతుందని, వీధి కుక్కలను దత్తత తీసుకోవడం కోసం కొత్తగా ఆప్ ను ప్రారంబించుకోవడం జరిగిందని,రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కుక్క సంతానోత్పత్తి చేసినపుడు కుక్క పిల్లలను సైట్ లో అందుబాటులో ఉండే క్రమం లో వాటిని దత్తత తీసుకోవచ్చుననీ, కొత్తగా బల్దియా నుండి డాగ్ కార్పస్ ఫండ్ ను ప్రారంభించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.

అనంతరం కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన వాల్ పోస్టర్ ను మేయర్ కమీషనర్ లు సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బల్దియా రూపొందించిన డాగ్ లైసెన్సింగ్, పెట్ రిజిస్ట్రేషన్,పెట్ అడాప్షన్ అప్లికేషన్ (ఆప్)ను మేయర్,కమీషనర్ లు బటన్ నొక్కి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ కార్పొరేటర్ లు గుండేటి నరేందర్ కుమార్ సురేష్ జోషి, బస్వరాజు కుమార స్వామి, దిడ్డి కుమార స్వామి, పోశాల పద్మ, చింతాకుల అనిల్ కుమార్, మరుపల్ల రవి, సిద్దం రాజు,ఓని స్వర్ణలత, సొమిషెట్టి ప్రవీణ్,ఆకుల మనోహర్ తో పాటు అదనపు కమీషనర్ అనిసుర్ రషీద్,జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, జిల్లా,పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ,మెప్మా శానిటేషన్ అధికారులు,ఆర్ పి లు జంతు ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.