• వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల మేరకు నూతనంగా స్టేషన్ ఇన్స్ స్పెక్టర్లు గా బాధ్యతలు చేపట్టి శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను కమిషనరేట్ కార్యాలయములో మర్యాదపూర్వకంగా కలుసు కొని పుష్పాగుచ్చాలు, పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్ స్పెక్టర్లకు పోలీస్ కమిషనర్ ముందుగా అభినందనలు తెలియజేసారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజాయితీ తో విధులు నిర్వహిస్తూ, న్యాయం జరుగుతుందనే భరోసా ను బాధితులకు కల్పిస్తూ, ఫిర్యాదు లపై తక్షణమే స్పందిస్తూ విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

పోలీస్ కమిషనర్ ను కల్సిన వారిలో మట్టేవాడ, హనుమకొండ, నర్సంపేట,పరకాల, అత్మకూరు, గీసుగొండ,రఘునాథ్ పల్లి సర్కిల్, నెక్కొండ సర్కిల్, ట్రాఫిక్, వరంగల్ ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు గోపి, సతీష్, రమణ మూర్తి,అబ్బయ్య, సంతోష్,బాబూలాల్ , శ్రీనివాస్, చంద్రమోహన్, శ్రీధర్, కరుణాకర్ ఉన్నారు.