వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ ఆలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జంగుబాయి మాలధారణ స్వాములు వారి ఇంటి దైవం నాగ దేవతను, అమ్మవారిని దర్శించుకున్నారు. నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలతో హారతులు ఇచ్చి నైవేద్యాలు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆదివాసీ భక్తులకు ఆలయ అర్చకులు దేవర వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.