• హింగె భాస్కర్ మరిన్ని పదవులు అలంకరించాలి
  •  రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న

వేద న్యూస్, ఎల్కతుర్తి:
తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్, ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగుర్ల వెంకన్న ఆకాంక్షించారు. భాస్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు…అనంతరం శాలువాతో సత్కరించారు.

భాస్కర్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా తనకు విషెస్ చెప్పిన అందరికీ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ కూడా భాస్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు లు భాస్కర్ కు శుభాకాంక్షలు చెప్పారు.