- హనుమకొండ జిల్లాకేంద్రంలో ఘనంగా చత్రపతి జయంతి
- జయంతి సందర్భంగా దివ్యాంగులకు అల్పాహారం అందజేత
వేద న్యూస్, హన్మకొండ:
మరాఠా యోధుడు, అసమాన ధీశాలి, ఆదర్శ మరాఠా స్వరాజ్య స్థాపకుడు బడుగుల జీవితాలలో దారిదివిటి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శివాజీ 394వ జయంతిని పురస్కరించుకొని ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు సోమవారం జరిపారు.
ఈ సందర్భంగా ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మల్లికాంబ మనోవికాస కేంద్రంలో సుమారు 200 మంది దివ్యాంగులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమానికి ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి శివాజీ ముఖ్యఅతిథిగా హాజరై దివ్యాంగులకు అల్పాహారం వడ్డించారు. అనంతరం బాలాసముద్రం లోని ఆరె సంఘ భవనంలో చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమల అలంకరించి నివాళులు అర్పించారు.
చెట్టుపెల్లి శివాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల బాధను, భారాన్ని తన బాధ్యతగా స్వీకరించి ప్రజలకు స్వాతంత్ర్యం ఇచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. ఆయన వ్యక్తిత్వం,పరిపాలన విధానం, దైర్యసహాసాలు, యుద్దనీతి, స్త్రీల పట్ల, గురువులపట్ల,ప్రజల పట్ల ఆయనకున్న గౌరవం బాధ్యత నేటి తరం పాలకులకు అనుసరణీయం అని తెలిపారు.
సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే శివాజీ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ, ధైర్యానికి, దేశభక్తికి దీరత్వాని, దైవభక్తి కి మారుపేరు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆ మహనీఅయుడిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజాన్ని పాలకులు ముందుకు నడిపించాలని సూచించారు.
కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కొల్లూరు కండెరావు, పేర్వాల లింగమూర్తి, వాడికారి బాబురావు, లోనే దీపక్ జి, గురుజాల నిరంజన్ రావు, హింగే భాస్కర్, సిరూరి రత్నాకర్, సదాశివ రావు, అంజాజి,వాడికారి లక్ష్మణరావు, వాడికారి కిషన్ రావు, మోకిడే చందర్ రావు, హనుమకొండ మండల అధ్యక్షుడు ఆడగాని శివాజీ, రాష్ట్ర నాయకులు హింగే రాజేశ్వర్ రావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మోటె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.