వేద న్యూస్, కొత్తకొండ:
శ్రీ వీరభద్ర స్వామి పరిధిలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు బెల్లం ముద్ద సమర్పించి అమ్మవాళ్లను తనివి దర్శించుకొని శిరస్సు వంచి నమస్కరించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని కోరారు. రాష్ట్ర మంత్రిగా ప్రజల శ్రేయస్సు బాగుండాలని, సర్వేజనా సుఖినోభవంతు అని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అన్నారు.

ప్రజలందరూ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని కొత్తకొండ దగ్గర సమ్మక్క సారలమ్మ తల్లులను వేడుకున్నారు. మొక్కులు సమర్పించిన మంత్రి వెంట దేవాలయ కమిటీ చైర్మన్, సభ్యులు, దేవస్థాన కార్యనిర్వాణాధికారి పి. కిషన్ రావు, అర్చకులు ఉన్నారు.

వారు మంత్రిని అమ్మ వార్ల సన్నిధికి తీసుకెళ్లి.. దర్శనమైన తర్వాత..వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అర్చకులు ఆశీస్సులు ఇచ్చారు. కోయ పూజారులు కూడా మంత్రిని దీవించి అమ్మ వార్ల పసుపు, కుంకుమ మంత్రి కి అందజేశారు. బెల్లం బంగారాన్ని కూడా వారికి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ కు అమ్మవార్ల చిత్రపటం అందజేశారు.