వేద న్యూస్ , వరంగల్:

హైదరాబాద్ లో విశ్వం లాబ్స్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులతో పోటీ పడి పాఠశాల విద్యార్థి దాసి సాయి మన్విత్ (3rd class) జూనియర్ లెవల్-1 విభాగం లో కన్సోలేషన్ బహుమతిని గెలుచుకున్నారు. 

ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని,  అలాగే పిల్లలో ఉన్న ప్రతిభ ని గుర్తించి ఉన్నత స్థాయి కి ఎదగాలని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.గెలిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు అవినాష్ బండి , మోహన్ బండి, ప్రిన్సిపాల్ సంతోష్, ట్రైనర్ హేమలత, స్టాఫ్ ఆదివారం అభినందించారు.

ఇట్టి విజయాలకు సహకరించిన విద్యార్థులకు,తల్లిదండ్రులకు ట్రేయినింగ్ టీచర్స్ కి పాఠశాల యాజమాన్యం తరుఫున అభినందనలు  చెప్పారు.