- 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన సీఎం
వేద న్యూస్, డెస్క్ :
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
కాగా తాజాగా మరో రెండు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ,మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.