- మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు
- జమ్మికుంట ‘దళిత బంధు’ సాధన కమిటీ నాయకులు
వేద న్యూస్, జమ్మికుంట:
దళిత బంధు లబ్ధిదారులైన తాము ‘దళిత బంధు’ రెండో విడత సాధనకు ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా..అక్కడి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమను అక్రమంగా అరెస్టు చేశారని
జమ్మికుంట ‘దళిత బంధు’ సాధన కమిటీ నాయకులు తెలిపారు.
బుధవారం వారు జమ్మికుంట పట్టణంలో టీడబ్ల్యూజేఎఫ్ జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించాచి మాట్లాడారు. ‘ప్రజావాణి’కి వెళితే కనీసం మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా సిటిఎస్ కు తరలించారని చెప్పారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కానీ, స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని..అలా దుష్ప్రచారం చేసే నాయకులు తమ వైఖరి మార్చుకోకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
‘దళిత బంధు’ రెండో విడత మంజూరు చేయకుంటే..వచ్చే లోకసభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే ఏ నాయకుడిని పొలిమేర దాటి తమ గ్రామాల్లోకి తిరగనివ్వమని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న దళిత నాయకులు పార్టీ జెండాలు పక్కనపెట్టి..తమ దళిత జాతి పక్షాన నిలబడాలని కోరారు.
గతంలో ఎమ్మెల్సీ ‘దళిత బంధు’ రెండో విడత ఆపాడని, తమకు ఎమ్మెల్యే మద్దతు ఉందని తమపై బురదల చల్లె బదులు ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉందని, మీరు మాకు న్యాయం చేస్తే మేము మీకు మద్దతిస్తామని కాంగ్రెస్ నాయకులు పత్తి కిష్ణారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.తమపై అవాకులు చెవాకులు పేలుస్తే ఆయన ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. పత్తి కృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, తన ఉనికిని చాటుకునేందుకు మమ్ములను వాడుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ‘దళిత బంధు’ సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, మంద రాజేష్, కోలుగూరి నరేష్, రామంచ రాకేష్, అకినపల్లి ఆకాష్, దాసారపు నాగరాజు,కోర్రి సతీష్, రక్షిత్ తదితరులు పాల్గొన్నారు.