- బీజేపి నాయకుల ఘాటు వ్యాఖ్యలు
వేద న్యూస్, వరంగల్ :
కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి, రాహుల్ బృందం లోక్సభ ఎన్నికల్లో పంచి పెట్టాలని చూస్తోందని, అవినీతి పాలన సాగించిన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టాలని కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఇన్చార్జి దర్మరావు ధ్వజమెత్తారు.
కాకతీయ, భద్రకాళి క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్ తూర్పు నియోజక వర్గం లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్ర ఆర్టీఓ జంక్షన్ మీదుగా శంభునిపేట సర్కిల్, నాగమయ్య గుడి, వాల్ మార్ట్, ఇసుక అడ్డా, హెడ్ పోస్టాఫీస్ వరకు కొనసాగింది.
హెడ్ పోస్టీఫీస్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి బిజెపి నాయకులు ప్రసంగించారు. ఈ యాత్ర ముఖ్య అతిధిగా బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమందర్ రెడ్డి తో పాటు క్లస్టర్ ఇంచార్జి, మాజీ శాసన సభ్యులు మార్తినేని ధర్మారావు, కాకతీయ క్లస్టర్ యాత్ర ప్రముఖ్ చాడ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాల నుంచి పాలించిన పార్టీలు కనీసం ఈ ప్రాంతంలో డబుల్ రోడ్డు వేయలేక పోయాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు దక్కించుకోవాలన్న లక్ష్యంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు బిజెపికి ఓటు వేసి మరో సారి మోడీ ని ప్రధానిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
క్లస్టర్ ఇంచార్జి మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలతో కాంగ్రెస్ ఆడుకుంటున్నదని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల అమలుకు రూ.2 లక్షల కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని, అప్పులను ఎత్తిచూపుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీల పేరిట కొందరికి లాభం చేకూర్చేందుకు అందరిపై భారం మోపుతున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ పార్టీల కతీతంగా నిరుపేదలకు అందుతున్నాయన్నారు. అనంతరం వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రగతి పథకాలు కావని, ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపే అప్పుల పథకాల నీ ఆరోపించారు.
తెచ్చిన అప్పు పథకాలకే సరిపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రధాని కావాలని చర్చ జరుతుతోందని తెలిపారు.
2014కు ముందు దేశ పరిస్థితి ఏ విధంగా ఉందో.. ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో రోజుకో కుంభ కోణం జరిగేదని, మోదీ హయాంలో నీతివంతమతమైన పాలన, సమాజ అభివృద్ధి పాలన కొనసాగుతుందని అన్నారు. ఏప్రిల్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా మోడీని మరోసారి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యవ్యక్తం చేశారు. బిఆర్ఎస్ హయాంలో, ప్రస్తుత కాంగ్రెస్ పథకాలతో కొందరికి మాత్రమే లాభం చేకూరుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నారే తప్ప పాలనపై దృష్టి సారించడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు ఎస్సీ మోస రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, చిటూరి అశోక్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,బిజెపి మండల, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.