వేద న్యూస్, జమ్మికుంట:
హుజురాబాద్ ఏసీపీగా శ్రీనివాస్ జీ ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. జమ్మికుంటలో సీఐగా పనిచేసిన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజకుమార్, జమ్మికుంట మండల అధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ముద్రగడ నవీన్ కుమార్, నాయకులు బాపూరావు, పోతుగంటి సదానందం తదితరులు పాల్గొన్నారు.
