- ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
- జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్దించాలి
- ఎంజీఎం జంక్షన్లో వరంగల్ టీయూడబ్ల్యూజే ఆందోళన
వేద న్యూస్, వరంగల్ టౌన్ :
దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని టీయూడబ్ల్యూజే వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంచందర్, మట్ట దుర్గాప్రసాద్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్2 గాంధీ జయంతి రోజున దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ), టీయూడబ్ల్యూజె రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం వరంగల్ జిల్లా శాఖ అధ్వర్యంలో ఎంజీఎం జంక్షన్లో అందోళన కార్యక్రమం నిర్వహించారు.
అక్కడ నుంచి నినాదాలు చేసుకుంటూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని గాంధీ విగ్రహంకు వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్దించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు సొంత ఇంటి కల దశాబ్ధాలు గడుస్తున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సాకారం కాలేదన్నారు. అర్హులైన వారికి నివేశన స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు సంగోజు రవి, మిద్దెల రంగనాథ్,యూనియన్ కోశాధికారి వడిచర్ల శ్రీనివాస్,యూనియన్ ఉపాధ్యక్షులు జన్ను స్వామి,కూర్ణ వెంకటేశ్వర్లు,అలువాల సదాశివుడు,అజయ్ సతీష్,సంతోష్,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆడేపు సాగర్,పెరుమాండ్ల మధు, బోళ్ల అశోక్, సంకినేని సంతోష్, బేతి ఉమా శంకర్, పాపాని భాస్కర్, ఎం.డీ సాజిద్, అమీర్, అక్రమ్, ప్రెస్ క్లబ్ బాధ్యులు పోడిషెట్టీ విష్ణువర్ధన్, వలిషెట్టీ సుధాకర్, ఎండీ.నయీం పాషా, విజయ్ రాజ్, గంగరజు, గోపి, శ్రీనివాస్, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.