వేద న్యూస్, డెస్క్ :
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షణ చేసిన ప్రధాని మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేష వస్త్రంతోపాటు చిత్రపటాన్ని అందించారు.