పేద న్యూస్, మరిపెడ:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు బిఆర్ఎస్ పార్టీ నుండిమహబూబాబాద్ పార్లమెంట్ సీటును (లోక్ సభ) మాలోతు కవిత కు కేటాయించారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి కవితను గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కవితకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు.
మరిపెడ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు దిగజర్ల శ్రీనివాస్ గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మానుకోటపై ఈసారి కూడా గెలిచేది గులాబీ జెండా నేనని ధీమా వ్యక్తం చేశారు.