•  ఆదాయానికి మించిన ఆస్తులపై ఆరా

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట తహసిల్దార్ రజిని ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.

బుధవారం హనుమకొండ కే ఎల్ ఎన్ రెడ్డి కాలనీ లోని తహ సిల్దార్ రజని ఇంట్లో, వివిధ ప్రాంతాలలోని ఆమె బంధువుల ఇళ్లల్లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు తాసిల్దార్ ఇంట్లో దాడులు చేస్తున్నట్లు సమాచారం.