- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిరుద్యోగ యువత జాబ్‌మెళాను సద్వినియోగం పర్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ యువతకు పిలుపునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో టి.యం.ఐ ఫౌండేషన్ ట్రస్ట్ వారి సహకారంతో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు.
ఈ నెల 16వ తారీఖు శనివారం రోజున హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఉదయం పది గంటల నుండి నిర్వహింబడే ఈ మెగా జాబ్ మేళాలో సూమారు 3వేలకు పైగా వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరగుతుందని పేర్కొన్నారు.
ఈ జాబ్ మేళాలో పాల్గొను యువత కనీసం పదవ తరగతి పాసై వుండాలి. ఇందులో పాల్గోనే యువత ముందుగా bit.ly/jmform సైట్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాల్సి వుంటుందని అన్నారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు అందిస్తున్న ఈ సదావకాశాన్ని సద్వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ యువతకు తెలిపారు.