- మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆరె సంక్షేమ సంఘ నేతల వినతి
వేద న్యూస్, ఎల్కతుర్తి:
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరె కులస్తులకు రాష్ట్రప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆరె సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం ఎల్కతుర్తి మండలకేంద్రంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఆరె కులస్తులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు సోమిడి అంజన్ రావు, జెండా రాజేష్, ఖండేరావు, మనోహర్ రావు, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి రాజు, బాబురావు, సంతాజి, రాజేశ్వరరావు, సాంబయ్య, హింగే భాస్కర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇంగిలె రామారావు, దామోదర్ రావు కోలె, కాంగ్రెస్ పార్టీ ఎల్కతుర్తి మండల మాజీ అధ్యక్షులు సుకినె సంతాజీ, యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు హింగె శ్రీకాంత్, నాయకులు, ఆరె కులస్తులు తదితరులు పాల్గొన్నారు.