వేద న్యూస్, జమ్మికుంట:

ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి శివాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ, రవాణా శాఖ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆరె సంక్షేమ సంఘం నాయకులు గురువారం కలిశారు. 16 కులాలకు ఇచ్చినట్టుగానే ఆరె కులానికి రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటుచేసి..తమను కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా చేయూత నివ్వాలని వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో 22 జిల్లాలలో 8 లక్షల ఆరె కులస్తులు ఉన్నారని వివరించారు. వారంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు గా, చిరు వ్యాపారస్తులు గా జీవిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, ప్రధాన కార్యదర్శి బలేరావు మనోహరావు, రాష్ట్ర నాయకులు అధర్ సండే నాగేశ్వరరావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇంగిలే రామారావు, డివిజన్ ఇన్ చార్జి ఇంగిలే ప్రభాకర్, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.