•  దళిత బహుజన విద్యార్థి ఉద్యమ సంఘాలు

వేద న్యూస్, హన్మకొండ :

ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ యాదవ్ హనుమకొండ భీమారంలోని ప్రభుత్వ బిసి బాలికల కళాశాల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రేణిగుంట్ల ప్రియాంకను రూ.20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వనందుకు కులం పేరుతో దూషించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ విధులకు అడ్డుతాగులుతున్నందున ఆయన వెంటనే అరెస్టు చేయాలని దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు హనుమకొండ ఎసిపి దేవేందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం సంఘాల నాయకులు మాట్లాడుతూ సంతోష్ బీసీ వెల్ల్ఫైర్ లో పని చేసే కేవలం ఎస్సీ , ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారిని డబ్బులు డిమాండ్ చేస్తూ వారు డబ్బులు ఇవ్వని నేపథ్యంలో వారిపైన ఆర్టీఐలు వేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ తిరుగుతుంటాడని ఆరోపించారు.

ఇలాంటి వాళ్ల వల్ల ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు భయభ్రాంతులకు గురి అవుతున్నారనీ అన్నారు. కావున వెంటనే భాష బోయిన సంతోష్ యాదవ్ ను అరెస్టు చేయాలని అతని నుండి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఏసిపి ని కలిసిన వారిలో గద్దల సుకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు , కన్నం సునీల్ టి ఎస్ ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ , వడ్డేపల్లి మధు మాదిగ ఎంఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ , రెనుకుంట్ల ఠాగూర్ డిఎంఎస్ఏ జిల్లా కన్వీనర్ , మనితేజ టి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు