- సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి
వేద న్యూస్, వరంగల్ :
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం శివనగర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రామ సందీప్ అధ్యక్షతన జక్కలొద్ది సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి పాల్గొని మాట్లాడారు. రామ సురేందర్ నగర్ (జక్కలోద్ది) ఏళ్ళ తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకొని చీకట్లో, మురుగులో నివాసం ఉంటున్న రామ సురేందర్ నగర్ జక్కలోద్ది గుడిసె వాసులకు మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అన్నారు.
ప్రజా పాలన లో భాగంగా నిరుపేదలైన జక్కలోద్ది గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ పతకం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని అధికార పార్టీ ని కోరారు. అనంతరం పార్టీ జిల్లా సహాయకార్యదర్శి షేక్ బాషిమియా మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి 2700 కుటుంబాలు జక్కలోద్ది రామ సురేందర్ నగర్లో నివాసం ఉంటున్నారని అన్నారు.
గుడిసె కాలనీ వాసులు రాత్రి వేళల్లో చీకట్లో ఉండాల్సి వస్తుందని వర్షం పడితే రోడ్లు, మురుగు కాలువలు లేక మురుగులోనే మగ్గిపోతున్నారని అన్నారు. ఇళ్లల్లో కరెంటు సౌకర్యం, వీధూల్లో లైట్లు లేక చీకట్లో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు.వెంటనే ప్రభుత్వం స్పందించి జక్కాలోద్ది రామ సురేందర్ నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం కాలనీకి రావాలంటే సమస్యలు పరిష్కరించాల్సిందేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి దండు లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సంగి ఎల్లేందర్, సిపిఐ జిల్లా నాయకులు యాకాంబ్ర చారి, సిపిఐ మండల నాయకులు రాజేందర్ ,సిపిఐ రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు, సెక్రటరీ గజ్జ చందు, కమిటీ సభ్యులు కొత్తూరు అనీల్, షాహిన్,నిమ్మల లావణ్య, మరిగిద్దె లావణ్య, రత్న అనూష కూన రాధికా ఉమ ప్రమీల సవిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.