- ప్రజలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శ
- ఎలిగేడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో విస్తృత స్థాయి సమావేశం
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
పెద్దపల్లి ‘గులాబీ’ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా మీటింగ్ నిర్వహించారు. దాసరి ఈ సందర్భంగా మాట్లాడారు. హస్తం పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా షరతులు విధిస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. హామీలు సరిగా అమలు కావాలంటే కొప్పుల ఈశ్వర్ నిను అధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఈశ్వర్,ఎంపీపీ తనిపర్తి స్రవంతి మోహనరావు, మండల అదక్షుడు బైరెడ్డి రాంరెడ్డి నాయకులు జగన్, రాజేశం, పోచలు, తిరుపతి , మల్లారెడ్డి ,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.