• ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్

వేద న్యూస్, మరిపెడ:

కాంగ్రెస్ పార్టీని మరింత బలిష్టం చేసేందుకు చేరికలపై దృష్టి సారించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ సూచించారు.శనివారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ కు డోర్నకల్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కంటే పదివేల ఓట్ల మెజార్టీ అధికంగా రావాలన్నారు.

దీనికోసం రాష్ట్ర పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గంలో చేరికలు ఉంటాయని తెలిపారు.తనకు వచ్చిన మెజార్టీకి కార్యకర్తలే కారణమన్నారు. మండల స్థాయిలో సీనియర్ పార్టీ లీడర్లు ఇతర పార్టీ నాయకుల చేరికలపై దృష్టి సారించాలని, పార్టీలో చేరిన నేతలను సమన్వయం చేసుకోవాలన్నారు.

కొత్త నాయకుల రాకతో కొంతమంది నాయకులు అభద్రతాభావానికి లోనవుతున్నారని, కానీ గత పది సంవత్సరాలుగా తన వెన్నంటి ఉన్న నాయకులను, కార్యకర్తలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, వారి ప్రాధాన్యత వారిదేనని స్పష్టంచేశారు.అంతేకాకుండా మండల స్థాయిలోని లీడర్లు కార్యకర్తలతో మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి,మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి పోరిక బలరాం నాయక్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,నాయకులు గంధసిరి అంబరీష,పానుగోతు రాంలాల్,కాలం రవీందర్ రెడ్డి,మెంచు అశోక్, మూల మురళీధర్ రెడ్డి, అలువాల ఉపేందర్,మహ్మద్ అఫ్సర్,షేక్ తాజుద్దీన్ , ఐలమల్లు, గుండగాని వేణు,బట్టు నాయక్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.