- చిరుతల రామాయణం ఒక మహా దృశ్యరూపం
- గరుడ కార్యక్రమంతో ప్రారంభం
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు ‘చిరుతల రామాయణం’ ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు ఆదివారం తెలిపారు. రామాయణ కళాకారుడు, కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య, శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ గురువుల చేత రామాయణ మహా కావ్యాన్ని జగ్గయ్యపల్లి కళాకారులు నేర్చుకున్నట్లు వివరించారు.
రామాయణంలో భాగంగా గరుడ(మందిరం) కార్యక్రమముతో ప్రారంభమై, ఆదివారం గ్రామ దేవతలైన పోషమ్మ ఇతర దేవతలకు బోనాలు సమర్పించారు. గ్రామంతో పాటు రామాయణం వేసే కళాకారులను చల్లగా దీవించాలని దేవతలను వేడుకొన్నారు. చిరుతల రామాయణం గ్రామస్తులు, చూపరులను ఆకట్టుకుంది. గ్రామంలో బోనాల సందర్భంగా పండుగ వాతావరణం ఏర్పడింది. కార్యక్రమంలో చిరుతల రామాయణ కళాకారులు,వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.