• జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే కి యువ నాయకులు ఆవిడపు ప్రణయ్, పిప్రే సాయి, ప్రశాంత్ వినతి

వేద న్యూస్, ఆసిఫాబాద్:
ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్ ని వెంటనే ప్రకటించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే కి యువ నాయకులు ఆవిడపు ప్రణయ్, పిప్రే సాయి, ప్రశాంత్  వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో వరి రైతులకు మద్దతు ధర కేటాయించి క్వింటాలుకి 500 రూపాయల బోనస్ ని కూడా ఇస్తామన్న ప్రభుత్వం హామీని అమలు చేయాలని కోరారు.

రానున్న 20 రోజుల్లో పంట చేతికొస్తుందని ఈ సందర్భంగా రైతులు ఎన్నో ఆశలతో ఎదురు చేస్తున్నారని కాబట్టి ప్రభుత్వం వెంటనే 500 బోనస్తో కలిపి మద్దతు ధర కల్పించి రైతులు ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ గత ఏడాది కేవలం 30 వరి కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఈ ఏడాది 37కు పెంచనున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చినందుకు యువ నాయకులను అభినందించారు.