వేద న్యూస్, వరంగల్ :

లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని 15-వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ అంతర్జాతీయ హ్యాండ్ బాల్ క్రీడకారుడు పొంగుల అశోక్ సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కు ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు.

గ్రేటర్ వరంగల్ పైడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి పోగుల అశోక్ దళిత కుటుంబానికి చెందిన వాడు. చిన్నతనం నుంచే నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన క్రీడలపై ఆసక్తితో ఎలాంటి సపోర్ట్ లేకుండా హ్యాండ్ బాల్ క్రీడలో
అంతర్జాతీయ స్థాయికి వెళ్లాడు.

అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన కూడా ఎలాంటి ఆదరణ లేకపోవడంతో హ్యాండ్ బాల్ ఆటను వదిలి వరంగల్లోనే వివిధ పనులను చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పోగుల అశోక్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గస్థానానికి సోమవారం నామినేషన్ వేయడంతో అతని స్నేహితులు, నగరంలోని క్రీడాకారులు, కుటుంబీకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోగుల అశోక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు