వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

మట్వాడ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మీర్ మహమ్మద్ అలీ ని వరంగల్ సెంట్రల్ డిసిపి బారీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలీతో పాటు మట్వాడ క్రైమ్ సిబ్బంది డీఎస్ఐ లచ్చయ్య, ఏఎస్ఐ చంద్రమౌళి, కానిస్టేబుళ్లు తిరుపతి ,హరినాథ్ లను వరంగల్ సెంట్రల్ డీసీపీ బారీ, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ , మట్వాడ సిఐ తుమ్మ గోపి అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు వివిధ రాష్ట్రల నుంచి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను అతి తక్కువ సమయంలో పట్టుకోవడంలో కానిస్టేబుల్ ఆలీ ప్రతిభవంతుడని ఈ సందర్భంగా పోలీస్ ఉన్నత అధికారులు అన్నారు. గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పలుచోట్ల అంతర్ రాష్ట్ర దొంగలు సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని చోరీ చేయగా దానిని 24 గంటలలో ఆ దొంగల గుట్టు రట్టు చేయడంలో కానిస్టేబుల్ అలీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.