వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
అతి ప్రమాదకరమైన హశిష్ మత్తు మందు స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను మట్టేవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.అరెస్టు చేసిన నిందితుడు నుండి సుమారు రూ.4లక్షల 50వేల రూపాయల విలువైన తొమ్మిది వందల గ్రాముల గంజాయి ఆకుతో తయారు చేసిన హశిష్ మత్తు పదార్ధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు అంతర్ రాష్ట్ర స్మగ్లర్ కాకినాడ జిల్లా, ఏళేశ్వరం ఎర్రవరం కు చెందిన చింతల వెంకట రాజు అలియాస్ బాబీ, వయసు 34 ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థంతో హంటర్ రోడ్ లోని ఏడు మోరిల ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.దాంతో మట్టేవాడ పోలీసులు తెలంగాణ నార్కోటిక్ అనాలాసిస్ విభాగం అధికారులతో కలసి మత్తు పదార్థం విక్రయించేందుకు సిద్ధంగా వున్న నిందితుడిని అదుపులోకి తీసుకోని తనిఖీ చేయగా నిందితుడి వద్ద నిషేధిత మత్తు పదార్ధం హశిష్ దొరికింది. కాగా మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి అదుపులో కి తీసుకోని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.