వేద న్యూస్,మొగుళ్లపల్లి : 

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు దంపతులు సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన మొగుళ్ళపల్లి మండల పిఎసిఎస్ చైర్మన్ గా పనిచేసి  రైతులకు విశిష్ట సేవలందించారు. అదేవిధంగా పోలినేని లింగారావు భార్య దగ్గు అనిత ఎల్కతుర్తి మండల ఏపీఓగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న పోలినేని లింగారావు పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రులకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు.