•  ప్రత్యేక వైద్యశిబిరానికి ఎంప్లాయీస్ నుంచి విశేష స్పందన

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట రైల్వే స్టేషన్ లో డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. క్యాంపునకు హాజరైన వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు డయాబెటిస్, గుండె పరీక్షలు ఈసీజీ, ఇలాంటి పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన మందులు పంపిణీ చేశారు.

ఉచితంగా మెడిసిన్స్ అందజేత

 డివిజనల్ మెడికల్ ఆఫీసర్ హరిబాబుతో పాటు ఫార్మసిస్ట్ సిహెచ్ తిరుపతి, నర్సింగ్ స్టాఫ్ గాయత్రి ,రేణుక ల్యాబ్ సూపరింటెండెంట్ గోపీనాథ్, రాజు ప్రసాద్, జీ రుపావతి తో కూడిన వైద్య బృంద సభ్యులు ఉద్యోగులకు మెడిసిన్స్ అందజేశారు.

 

“సీజనల్ డిసీజెస్ ” పై ప్రత్యేక అవగాహన 

 ఈ సందర్భంగా డాక్టర్ హరిబాబు సీజనల్ వ్యాధులపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. జాగ్రత్తలతో సీజనల్ డిసీజెస్ బారిన పడకుండా ఉండవచ్చని చెప్పారు. వేసవికాలం మాదిరిగా ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఉపశమనం కోసం సమృద్ధిగా నీరు, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్, మజ్జిగ తాగాలన్నారు. వానాకాలం ప్రారంభమవుతున్న క్రమంలో సీజనల్ డిసీజెస్ ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఎండి ఖాదర్ ఖాన్, వెంకటస్వామి, మొయినుద్దీన్, ఎస్ రాజయ్య, బి సమ్మయ్య, డి సారంగపాణి, మొగిలి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.