వేద న్యూస్, కొత్తగూడెం:
పాము పేరు చెపితేనే సహజంగా అందరికీ భయం వేస్తోంది. అందులో నాగు పాము అంటే అందరికీ ముచ్చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగు పాము పిల్లలు గుంపుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ..నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రిషన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ టీమ్ కు సమాచారం అందించారు.
ఒక నాగుపాము, 32 నాగుపాము పిల్లలను స్నేక్ క్యాచర్ దత్తు టీం సభ్యులు పట్టుకున్నారు. దాంతో క రెంటు ఎలక్ట్రిషన్ రాజు కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం తప్పింది.