వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లాకేంద్రంలో శనివారం నూతనంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభించనున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ క్లబ్ ఓపెనింగ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, మామిడి సోమయ్య, బసవపున్నయ్య, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు అన్ని రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, నాయకులు హాజరవుతున్నారని వెల్లడించారు.

జిల్లాకేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని ఈ సందర్భంగా యోహాన్, రాధాకృష్ణ తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ప్రెస్ క్లబ్‌లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ఆఫీసు ఉపయోగపడుతుందన్నారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసే ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ కు నియోజకవర్గంలోని జర్నలిస్టులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.