•  సయ్యద్ అప్సర్ పాషా

వేద న్యూస్, హన్మకొండ :

దేశ చరిత్రలోనే ఒకేసారి రుణమాఫీ దాఖలాలు ఇప్పటివరకు లేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గ్రేటర్ వరంగల్ 50 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు. శుక్రవారం రైతు రుణమాఫీ అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్దిచేకూర్చడంపై రైతులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సయ్యద్ అప్సర్ పాషా మాట్లాడారు.
రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగగా చూడాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.