వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 6వ తేదీ(మంగళవారం) నుంచి సెప్టెంబర్ 2 (సోమవారం) వరకు వీరభద్ర నక్షత్ర దీక్ష మాలాధారణ భక్తులు చేయవచ్చని ఆలయ అర్చకుడు రాంబాబు సోమవారం తెలిపారు. ఈ దీక్షను నక్షత్ర సంఖ్యను బట్టి 27 రోజులుగా నిర్ణయించనిట్టు వెల్లడించారు.

ఈ దీక్ష మాలాధారణ వలన రోగ, శతాధిక, ఆయుష్య, శతృ విమోచన, పుత్ర లాభ, ధన, కనక, ఆయురారోగ్యాలు కలుగునని పేర్కొన్నారు. ఇట్టి దీక్షను హనుమంతుడు కూడా తీసుకున్నట్లు స్కంద పురాణములో చెప్పబడిందని వివరించారు.

భక్తులు ప్రతి శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో వీరభద్ర దీక్షను తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. దీక్షకు వస్త్రాలు గంధం రంగువి, ఎర్ర చందనం మాలలు తీసుకోవాలన్నారు. వీరభద్ర నక్షత్ర దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలకు వ్యవస్థాపక గురుస్వామి, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబును 99636 77927 నంబర్‌లో సంప్రదించొచ్చని దేవాలయ అర్చక సిబ్బంది, కార్యనిర్వహణ అధికారి పేర్కొన్నారు.