•  జమ్మికుంట ఎస్సై టీ వివేక్

వేద న్యూస్, జమ్మికుంట:
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్సై టీ వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలతో పాటు పలు అంశాలపై యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వివేక్ మాట్లాడుతూ నేటి యువత గంజాయి బారినపడి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని సైతం రోడ్డు పాలు చేస్తున్నారని తెలిపారు. గంజాయి గురించి నేరుగా తమకు సమాచారం అందించాలని సూచించారు.

సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు. కొందరు తెలివిగా మీకు 10 లక్షల రూపాయలు వచ్చాయని నమ్మించి రెండు లక్షలు కడితే పది లక్షలు డ్రా చేసుకోవచ్చని ఫోన్ చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.

కష్టం చేస్తేనే డబ్బులు రావని ఫ్రీగా లక్షల రూపాయలు వస్తున్నాయని నమ్మించి మోసం చేసే నేరగాళ్లు ఎక్కువయ్యారని, యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే జూదం ఆడినట్లయితే వారి పట్ల పోలీసులు కఠినంగా ఉంటారని తెలిపారు. ఎలాంటి సమాచారం ఉన్న నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ టీ వివేక్ పేర్కొన్నారు.