- బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్
వేద న్యూస్, వరంగల్:
నర్సంపేట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 7న జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ ‘చలో అమృత్ సర్’ (పంజాబ్) పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ వృత్తులు వేరైనా బీసీల నెత్తురు ఒక్కటేనని చెప్పారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బీసీ బిగ్గెస్ట్ క్యాస్ట్, బ్రిలియంట్ క్యాస్ట్, బెస్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా అని ప్రతి ఒక్క బీసీ కి తెలిసేలా చాటి చెప్పాలన్నారు. దేశ జనాభాలో 60 % ఉన్న బీసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో జాతీయ ఓబీసీ 9వ మహాసభ ఏర్పాటు చేసినట్టు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని.., అదే విధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనాభా దామాషా ప్రకారం చట్ట సభలో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తో ఈ మహాసభను ఏర్పాటు చేస్తు్న్నట్టు తెలిపారు.
ఈ మహాసభకు వరంగల్ జిల్లాతో పాటు నర్సంపేట నియోజకవర్గం నుండి బీసీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బీసీల సత్తా చాటాలని డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జీజుల సాగర్, చెన్నూరి రవి ముదిరాజ్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శి ఓడపెల్లి రమేష్, మర్రి క్రాంతి కుమార్, పెండ్యాల కృష్ణ, ఆవుల పృథ్వీరాజ్, నాగరాజు, సర్వేశం తదితరులు పాల్గొన్నారు.