వేద న్యూస్, కరీంనగర్:

బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా కో ఇన్  చార్జి గా గోగికార్ అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ తనను జిల్లా కో ఇన్ చార్జిగా   నియమించినందుకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ , కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ , పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , నాయకులకు అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనకు పదవి అప్పగించిన నేపథ్యంలో తాను ఆ పదవిని శక్తి వంచన లేకుండా నిర్వహిస్తానని వెల్లడించారు.