• కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పందన అనాథాశ్రమంలో..

వేద న్యూస్, జమ్మికుంట:
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ జన్మదినం సందర్భంగా గురువారం ఆయన మిత్రుడు కొమ్మిడి రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్పందన అనాథాశ్రమంలో పిల్లల చేత కేక్ కట్ చేయించారు. వారికి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకుడు సతీష్ కుమార్, నల్ల కొండల్ రెడ్డి, మద్దుల ప్రశాంత్, సత్యనారాయణ, సమ్మిరెడ్డి, సోక్కారావు తదితరులు పాల్గొన్నారు.