వేద న్యూస్, వరంగల్:
నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో బతుకమ్మ విగ్రహానికి బతుకమ్మ విగ్రహ దాత పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, మాజీ జెడ్పిటిసి బక్కి కవిత రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి , ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు ,మండల కాంగ్రెస్ నాయకులు ఈదునూరు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని చెప్పారు. పూల సింగిడి ‘బతుకమ్మ’ పండుగ ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ అని వెల్లడించారు.