వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలకు ప్రాంగణం రెడీ అయింది. ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా, ఆనందంగా అపురూపంగా జరుపుకునే ‘‘బతుకమ్మ’’ పండుగకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేశ్ ఇంజపెల్లి తెలిపారు.
ఒగ్లాపూర్ గ్రామ పరిధిలోని మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడే స్థలంలో ఇబ్బంది కలగకుండా.. గడ్డిని ట్రాక్టర్ చేత ఆదివారం క్లీన్ చేయించారు. బతుకమ్మ ఆడే స్థల ప్రాంగణంలో లెవలింగ్ సైతం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేయించినట్టు నరేశ్ వెల్లడించారు.
ప్రకృతిని, పూలను పూజించే సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని, తెలంగాణ ఆడబిడ్డలు హాయిగా పూల సింగిడి ‘బతుకమ్మ’ పండుగను నిర్వహించుకుంటారని ఈ సందర్భంగా జీపీ సెక్రెటరీ పేర్కొన్నారు.