వేద న్యూస్, వరంగల్:
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం..నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలోని మాంకాల ప్రవీణ్ చౌక ధరల దుకాణంలో ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం లో భాగంగా అభయహస్తం క్రింద ప్రభుత్వం జారి చేయబడిన రూ.500 గ్యాస్ సబ్సిడీ సిలెండర్ పథకానికి సంబంధించిన ధ్రువ పత్రాలను లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ నాయకులు బక్కి నరేష్ అందించారు.
ఈ సందర్భంగా బక్కి నరేష్ మాట్లాడుతూ…. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ గ్యాస్ సబ్సిడీ అందుతుందన్నారు.
కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్డే సురేష్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి రాజశేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమ్ముల చిన్నారి , గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాంకాల మధుకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బుద్ధ సంపత్, అనుముల సోమిరెడ్డి, బత్తిని శ్రీధర్, చిలువేరు ముత్తయ్య, బత్తిని సమ్మయ్య, పొదిల కుమార్, అడుప కృష్ణ, వడ్డే కరుణాకర్,బాకీ,మహేష్, మంకాల మధు, మాంకాల సాంబయ్య,కొత్తూరు నవీన్, తూనం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.