• మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ:

ఎన్నికల్లో ఎంతో మంది నిలబడతారు రామగుండం ను ఎవరు అభివృద్ధి చేయగలరో చూడాలని, అభ్యర్థి శక్తి సామర్థ్యాలు చూసి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ ఆర్టీసి చేర్మెన్ సోమారపు సత్యనారాయణ అన్నారు.బుధవారం శారదా నగర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జనగామ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి సత్యనారాయణ హాజరై కార్యకర్తల ను ఉదేశించి మాట్లాడారు.

కొంతమంది డబ్బు విచ్చల విడిగా పంచి గెలుపొందుతామని అనుకుంటున్నారని ఎటువంటి ప్రబోలలకు లొంగకుడదన్నారు. ఓట్ వేసి ఈసారి తిరిగి ఎమ్మెల్యే గా గెలిపిస్తే రామగుండము ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చి దిద్దుతానని తెలిపారు .జనగామ రాయలింగం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో సోమారపు అరుణ్ కుమార్, పిడుగు కృష్ణ,దేవకర్ణ,కొమురయ్యా,కల షేకర్,సంపత్ ,అరవింద్,రవి,శ్యామ్, మరియు అధికసంఖ్యలో కార్యకర్త లు నాయకులు పాల్గొన్నారు