- ఇంటింటికీ స్టిక్కరింగ్ చేస్తూ డీటెయిల్స్ సేకరణ
వేద న్యూస్, ఓరుగల్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కరింగ్ చేస్తూ,ఇండ్ల వివరాలు సేకరించారు.
సర్వేకు వచ్చే అధికారులకు అందించవలసిన సమాచారం గురించి ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, సర్వే అధికారులు సతీష్ కుమార్, రమేష్, ఉమారాణి గ్రామస్తులు మన్నెం ప్రకాష్ రెడ్డి,రాసమల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.