వేద న్యూస్, ఓరుగల్లు:

కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనే ఎజెండాను రాష్ట్ర సర్కారు పెట్టుకున్నదని ఆరోపించారు. 

అధికారంలో ఉన్న నాటి కంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సమయంలో కేటీఆర్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నదని పేర్కొన్నారు. గత 11 నెలల కాలంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనే ఎజెండాను సర్కారు పెట్టుకున్నదని ఆరోపించారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమం నుంచి వచ్చిన డైనమిక్ లీడర్ కేటీఆర్ అని వివరించారు. ప్రజల్లో కేటీఆర్ కు ఉన్న ఆదరణను చూసి ప్రస్తుత సర్కారు జంకుతోందన్నారు. ప్రస్తుత సర్కారు చేస్తున్న ప్రతి చర్యకూ భవిష్యత్తులో ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని యువనేత నరేశ్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.