వేద న్యూస్, వరంగల్:

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి నీ నవంబర్ 15న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.గురువారం నర్సంపేట పట్టణంలోని అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

భగవాన్ బిర్సా ముండా నవంబర్ 15న 150 వ జయంతిని ఘనంగా నిర్వహించాలని గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలని పీసా చట్టం మరియు ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఎఫ్ ఆర్ ఏ లపై ఆదివాసి గిరిజన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఆయన జననం 1975 నవంబర్ 15న జన్మించడం జరిగింది బ్రిటిష్ వలస వాదులపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధుడు బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు బిర్సా ముండా 1875 నుండి బీర్సా భగవాన్ భారతీయ అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు జానపద నాయకుడు ఇతడు మూండజాతికి చెందినవాడు 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్ జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలిటరీ ఉద్యమానికి సారధ్యం వహించాడు 22 ఏళ్ల వయసులో 1897లోనే బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించారు.

తద్వారా భారత స్వతంత్ర ఉద్యమంలో చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు ఇతడి గౌరవార్థం భారతీయ పార్లమెంటులోనే సెంట్రల్ ఆల్ ఆయన చిత్రపటం ఉంది ఈ విధంగా సత్కరించబడిన ఏకైక అట జాతుల నాయకుడు బిర్సా ముండా అని పాలకుర్తి విజయ్ కుమార్ కొనియాడారు.

నవంబర్ 15న బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించాలని అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.