- మరిపెడ ఉన్నత పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయుడు బయగాని రామ్మోహన్
- ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు బయగాని రామ్మోహన్ అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తదుపరి ప్రారంభ ఉపన్యాసంలో రామ్మోహన్ మాట్లాడారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా సమాన అవకాశాలు లభించాయని చెప్పారు. హక్కులతోపాటు బాధ్యతలు సక్రమంగా నిర్వహించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పిల్లలచే “భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, స్వాతంత్రాన్ని అంతస్థుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 వ తేదీని ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకొని ఈ రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకున్నాము.” అను ప్రతిజ్ఞ చేయించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ఈ ప్రతిజ్ఞ చేయించినట్టు వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీశైలం, లెనిన్, సారయ్య, ఇతర ఉపాధ్యాయులు జనార్ధనా చారి, నెహ్రూ, బాబురావులు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న, ప్రకాష్ సురేష్, జాహెదా, రాజకుమారి, అనిత, మంజూశ్రీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.