- ఎస్ ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్,సాయిల్ సైన్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసన్న
వేద న్యూస్, వరంగల్:
పంటల దిగుబడిలో భూసార పరీక్షలు అత్యంత కీలకమని ఎస్ ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్,సాయిల్ సైన్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మి ప్రసన్న అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు పంటల ఉత్పాదకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా హసనపర్తి మండలం,సీతంపేట గ్రామంలో మట్టి నమూనాపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత మరియు సరైన నమూనా పద్ధతుల గురించి పాల్గొనే వారికి అవగాహన కల్పించడంపై దృష్టి సారించారు.మట్టి నమూనా పరీక్షలు ప్రతి సంవత్సరం చేసినచో మన భూసారము, దానిలో ఉండే స్థూల మరియు సూక్ష్మ పోషకాల శాతం ఎంత వరకు ఉన్నవి,దాన్ని బట్టి ఎరువుల వాడకం లో జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు.
దాని వల్ల రైతు యొక్క పెట్టుబడులు తగ్గి,అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు.భూసార పరీక్ష యొక్క ప్రయోజనాలు, పోషక లోపాలను గుర్తించడం,ఎరువుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భూసార పరీక్ష ఎలా సహాయపడుతుందో రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో జాతీయ మరియు రాష్ట్ర అవార్డు గ్రహీత తొకల ఆదిరెడ్డి తో పాటు అధిక రైతులు పాల్గొన్నారు.