వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో మరాఠ సామ్రాజ్య స్థాపకుడు, హైందవ ధర్మ రక్షకుడు భారతీయ వీరత్వం రాజకీయ ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ 395వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

గ్రామ ఆరె కుల సంఘం అధ్యక్షుడు లింగంపల్లి చిరంజీవి అధ్యక్షతన గ్రామంలో జయంతి వేడుకలు  నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి  పూల దండలు వేసి కొబ్బరికాయలు కొట్టి తదానంతరం స్వీట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో శివాజీ మహరాజ్ అభిమానులు, జిల్లా, మండల ఆరె కుల సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.