• ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు  చేయిస్తాం: కమిషనర్

వేద న్యూస్, వరంగల్/కాశిబుగ్గ:
దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో సభ్యులు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాను శుక్రవారం కలిశారు. బతుకమ్మ, దసరా పండుగకు కావలసిన ఏర్పాట్ల గురించి కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా ఉత్సవాలు కావాల్సిన వాటర్ సదుపాయం, లైటింగ్, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, దసరా ఉత్సవ సమితి కన్వీనర్ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, దసరా పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి బాంబుల కుమార్, ఆర్టిఏ మెంబెర్ గోరంటల మనోహర్, గుత్తికొండ నవీన్, ఓం ప్రకాష్ కొలారియా, దుబ్బ శ్రీనివాస్, మార్టిన్ లూథర్, వేముల నాగరాజు, సిద్ధోజు శ్రీనివాస్, గణిపాక సుధాకర్, మార్త ఆంజనేయులు, కోట సతీష్ తదితరులు పాల్గొన్నారు.