వేదన్యూస్ – ముంబై
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని గుండె సంబంధిత ఆపరేషన్ నిమిత్తం ముంబై వెళ్లిన సంగతి తెల్సిందే. ముంబైలోని ప్రముఖ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్సం నిమిత్తం చేరారు.
ఆ ఆసుపత్రి వైద్యులు తాజాగా మాజీ మంత్రి కోడాలి నానికి హార్ట్ సర్జరీ చేశారు. ఈ సర్జరీ విజయవంతగా ముగిసిందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోడాలి నాని త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల హార్ట్ ఆటాక్ రావడంతో నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుండి ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు.