వేదన్యూస్ – ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతిచ్చింది. ఫౌర విమాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను జారీ చేసింది.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రెండు ఎయిర్ పోర్టులు ఏర్పాటుకు అనుమతి రావడం ప్రభుత్వ కృషికి నిదర్శనం అని అన్నారు. అక్కడ త్వరలోనే వాయు శిక్షణా కేంద్రాన్ని కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
జాయింట్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాయుసేన లేఖ రాసిందని కూడా ఆయన పేర్కొన్నారు. దీనికి అవసరమైన భూమి.. మౌలిక వసతుల కల్పనతో కూడిన వివరాల నివేదికను కేంద్రానికి పంపుతామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.